బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జయప్రద

Update: 2019-03-26 02:40 GMT

మాజీ ఎంపీ, సినీనటి జయప్రద బీజేపీలో చేరారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న జయప్రద వైఎ్‌సఆర్‌సీపీ లేదా టీడీపీ లో చేరతారని భావించారు. అయితే అనూహ్యంగా ఆమె సోమవారం బీజేపీ కండువా కప్పుకున్నారు. అమర్‌సింగ్‌ సన్నిహితురాలిగా సమాజ్‌వాదీ పార్టీలో ఓ వెలుగు వెలిగిన జయప్రద.. కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

యూపీలోని రామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు ఆమె. కాగా గతంలో ఆమెపై సమాజ్‌వాదీ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఆ తరువాత అమర్‌సింగ్‌తో కలిసి రాష్ట్రీయ లోక్‌మంచ్‌ పేరుతో పార్టీ స్థాపించారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో అమర్‌సింగ్‌తో కలిసి ఆర్‌ఎల్డీలో చేరారు. జయప్రద బీజేపీలో చేరారు. ఆమె రామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

Similar News