జమ్ముకశ్మీర్‌లో మళ్లీ సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయి

జమ్ము కశ్మీర్‌లో మళ్లీ సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయని,ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కావాలనే కొందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Update: 2019-10-15 09:43 GMT

జమ్ము కశ్మీర్‌లో మళ్లీ సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయని,ఎలాంటి ఆంక్షలు లేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కావాలనే కొందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు తర్వాత ఎలాంటి హింస జరగలేదని స్పష్టం చేశారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్‌లో కర్ఫ్యూ వాతావరణం లేదని, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు లేవన్నారు.

ఇటీవలె అక్కడ మొబైల్‌ సేవలు పునరుద్ధరించామని తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దుతో ముందు జాగ్రత్తగా కొందరిని ఆధినంలోకి తీసుకున్నారని , కొన్ని అల్లరిమూకలను అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు. కేవలం 6 పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనే 144 సెక్షన్‌ అమల్లో ఉందని అమిత్ షా వెల్లడించారు. అక్కడ అన్ని వ్యాపారాలు ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయని తెలిపారు. జమ్ము, కశ్మీర్‌ రెండు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతుందని అమిత్ షా తెలిపారు.  

Tags:    

Similar News