ఇస్రో మరో ఘనత.. జీశాట్-30 విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ఖాతాలో మరో అరుదైన ఘనత సాధించింది.

Update: 2020-01-17 03:35 GMT

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ఖాతాలో మరో అరుదైన ఘనత సాధించింది. భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రయోగించింది. శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ వాహకనౌక ద్వారా జీశాట్-30 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది కేవలం 38 నిమిషాల్లో జరగడం విశేషం. 3357 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ కోసం ప్రయోగించారు. దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సంబంధిత సేవలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇన్‌శాట్- 4ఏ స్థానంలో మరింత మెరుగ్గా సేవలందించేందుకు జీశాట్-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించింది. కాగా, ఈ ఉపగ్రహ ప్రయోగం ద్వారా దేశ ఇంటర్నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. 



 

Tags:    

Similar News