విక్రమ్ ల్యాండర్ పై ఆశలు వదులుకోలేదు : ఇస్రో

Update: 2019-10-02 06:46 GMT

చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది . ప్రస్తుతం చంద్రుడిపై రాత్రి సమయం కావడంతో 10 రోజుల కిందట తమ ప్రయత్నాలకు విరామం ఇచ్చామన్నారు. 14 రోజుల పాటు సాగే ఈ దశ వల్ల వ్యోమనౌకకు సౌర శక్తి లభించదన్నారు. పగటి సమయం ఆరంభమయ్యాక కమ్యూనికేషన్‌ సంబంధాల పునరుద్ధరణ కసరత్తు ప్రారంభిస్తామని తెలియజేశారు. మూడు రోజలు క్రితం నాసా విడుదల చేసిన చిత్రాలను కూడా పరిశీలిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలియజేశారు. క్రాష్ ల్యాండింగ్ జరిగినా విక్రమ్ సేఫ్ గా ఉండే అవకాశాలపై పరిశోధిస్తున్నట్టు తెలిపారు. 

Tags:    

Similar News