ప్రయాణికులకు పరిహారం : ఒక్కొక్కరికి రూ.250..

ఎవరినా ప్రయానికిలు టికెట్ కొనకపోతే రైల్వే వారికి పరిహారం చెల్లించడం చూసాం కాని రైలు ఆలస్యం అయితే రైల్వే వారు ప్రయాణికులకు పరిహారం చెల్లించడం ఇప్పటివరకు ఎప్పుడు, ఎక్కడ వినలేదు, చూడలేదు.

Update: 2019-10-21 11:38 GMT

ఎవరైనా ప్రయానికిలు టికెట్ కొనకపోతే రైల్వే వారికి పరిహారం చెల్లించడం చూసాం కాని రైలు ఆలస్యం అయితే రైల్వే వారు ప్రయాణికులకు పరిహారం చెల్లించడం ఇప్పటివరకు ఎప్పుడు, ఎక్కడ వినలేదు, చూడలేదు. కాని ఐఆర్‌సీటీసీ మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయాణికులకు అక్షరాల రూ.1.62లక్షల పరిహారం చెల్లిస్తుంది. ఏంటి నమ్మబుద్ది కావడం లేదు కదా. కాని అది నిజం తేజన్‌ రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తామని ఐఆర్‌సీటీసీ మాట ఇచ్చింది.

ఆ రైలు ఆలస్యం కావడంతో ఇప్పుడు ఈ మాటను నిలబెట్టుకోనుంది. 950మంది ప్రయాణికులకు రూ.1.62లక్షల పరిహారం ఇన్ఫూరెన్స్‌ కంపెనీల ద్వారా అందించనుందని అధికారులు వెల్లడించారు. అక్టోబర్‌ 19న లఖనవూ నుంచి ఉదయం 9.55గంటలకు బయలుదేరిన తేజన్‌ రైలు దిల్లీకి 12.25 చేరుకోవాలి. కానీ, కాన్‌పూర్‌ ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మధ్యాహ్నం 8.40గంటలకు చేరుకుంది.

అలాగే 8.85గంటలకు తిరిగి లఖ్‌నవూబయలుదేరాల్సిన రైలు 5.30గంటలకు గానీ కదలేదు. దీంతో రాత్రి 10.05గంటలకు లఖ్‌నవూ చేరుకోవాల్సి ఉండగా రాత్రి 11.80గంటలకు గానీ చేరుకోలేదు. దీంతో లఖ్‌నవూ నుంచి దిల్లీకి వెళ్లిన 450మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చొప్పున, దిల్లీ నుంచి లఖ్‌నవూకి వెళ్లిన 50మందికి ఒక్కొక్కరికి రూ.100చొప్పున చెల్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తేజస్  టికెట్‌పై ఇచ్చిన బీమా సంస్థ లింక్‌ ద్వారా పరిహారం పొందవచ్చునని ఐఆర్‌సీటీసీ తెలిపింది.


Tags:    

Similar News