నా స్నేహితుడు మోదీని కలిసేందుకు వెళ్తున్నా: ట్రంప్

Update: 2020-02-23 15:09 GMT
Donald Trump File Photo

భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ బయల్దేరారు. వైట్‌హౌస్ నుంచి సతీమణి మెలానియాతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్‌‌వన్‌ విమానంలో భారత్ బయల్దేరారు. జర్మనీ మీదుగా ఈ విమానం భారత్‌కు రానుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు రేపు మధ్యాహ్నం 11.40 గంటలకు ట్రంప్‌ చేరుకోనున్నారు. భారత్‌ పర్యటనకు ముందు మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ ..తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని తెలిపారు.

భారత ప్రధాని మోదీ తన స్నేహితుడని, భారత ప్రజలను కలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపారు. భారత్‌ వెళ్లాలని తాను ఎప్పుడో అనుకున్నానని వెల్లడించారు. 'భారత్‌లోనే అది అతిపెద్ద కార్యక్రమం జరగబోతోందని మోదీ నాతో చెప్పారు. అలాంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సుహకతతో ఉన్నా'' అని తెలిపారు. 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రప్ మాట్లాడారు. ట్రంప్‌ భారతపర్యటనకు ముందు ఆ‍యన తనయ ఇవాంక ట్రంప్ ట్వీట్‌ చేశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ మోదీని కలుసుకోవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు.




Full View


Tags:    

Similar News