ఐటీ సోదాలు... మాజీ ఉపముఖ‌్యమంత్రి వ్యక్తిగత సహాయకుడి ఆత్మహత్య
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత జీ పరమేశ్వర వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న రమేష్ ఆత్మహత్యకు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. నాలుగు రోజులుగా పరమేశ్వర చెందిన కార్యలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత జీ పరమేశ్వర వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న రమేష్ ఆత్మహత్యకు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. నాలుగు రోజులుగా పరమేశ్వర చెందిన కార్యలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరవేశ్వర శుక్రవారం రాత్రి రమేశ్‌ను అదుపులోకి విచారించిన ఐటీ అధికారులు శనివారం విడిచిపెట్టారు. రమేశ్ ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
ఆత్మహత్యకు ముందు రమేష్ భార్య ఫోన్‌చేయగా పరమేశ్వర ఇంటికి వెళ్తున్నట్టు చేప్పాడు. అంతకుముందు మూడు గంటల తర్వాత ఉరి వేసుకుని చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఐటీ అధికారులు విచారించిన నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైనట్లు లేఖ సూసైడ్ రమేశ్ రాసినట్లుగా కారులో దొరికింది. మరోవైపు అధికారులు తాము రమేశ్‌ను విచారించలేదన్నారు. మొబైల్ కాల్‌లాగ్‌ను పరిశీలించి సాక్ష్యంగానే వినియోగించుకున్నామని స్పష్టం చేశారు. రమేశ్ 15 ఏళ్ల క్రితం కర్ణాట పీసీపీ కార్యాలయంలో టైపిస్ట్‌గా చేరారు. కాగా.. పరమేశ్వర పీసీసీ అధ్యక్షుడి కావడంతో రమేశ్‌ను పర్సనల్ అసిస్టెంట్ నియమించుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రమేష్ కు ఇద్దు పిల్లలున్నారు.
రమేశ్ ఆత్మహత్యపై మాజీ ఉపముఖ‌్యమంత్రి పరమేశ్వర స్పందించారు. ఐటీ అధికారులు తమ ఆప్తులను విచారించాల్సిన అవసరం లేదని అన్నారు. అవసరమైన విషయాలను సేకరిచాలని వ్యాఖ్యానించారుర అధికారుల ఒత్తిడి వల్లే రమేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాని డిమాండ్ చేశారు.
అయితే మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర మెడికల్ ప్రవేశాల్లో కుంభకోణానికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.