గాంధీజీ ఆత్మహత్య ... ప్రశ్న చూసి ఆశ్చర్యపోయిన విద్యార్ధులు

గాంధీ ఆత్మహత్య చేసుకున్నారా.. లేక కాల్చి చంపారా అంటే విద్యావంతులకే కాదు భారత దేశంలో పుట్టిన ప్రతీ ఒక్కరికి తెలుసు ఏలా చనిపోయారని. కానీ ..గుజరాత్ లోని ఓ పాఠశాలలో నిర్వహించిన తోమ్మిదో తరగతి పరీక్షా పత్రంలో ఓ చిత్రమైనా ప్రశ్న అడిగారు.

Update: 2019-10-13 14:58 GMT

గాంధీ ఆత్మహత్య చేసుకున్నారా.. లేక కాల్చి చంపారా అంటే విద్యావంతులకే కాదు భారత దేశంలో పుట్టిన ప్రతీ ఒక్కరికి తెలుసు ఏలా చనిపోయారని. కానీ ..గుజరాత్ లోని ఓ పాఠశాలలో నిర్వహించిన తోమ్మిదో తరగతి పరీక్షా పత్రంలో ఓ చిత్రమైనా ప్రశ్న అడిగారు. అది "గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు"అని. దీంతో విద్యార్ధులులే కాదు ఈ ప్రశ్న చూసి విద్యాశాఖ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.

సుఫలాంశాల వికాస్ సంకుల్ పాఠశాల ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ ప్రభుత్వం తరపున అన్ని నిధులు మంజూరు అవుతాయి.శనివారం నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షలలో ఇలాంటి ప్రశ్నలు అడగడం సరైంది కాదని, దీనిపై శాఖపరమైనా చర్యలు తీసుకుంటామని, సమగ్ర విచారణకు ఆదేశించామని అధికారులు తెలిపారు. అయితే గతంలోనూ ఇదే తరహా ప్రశ్నలు ఈ స్కూల్ లో అడిగారు. "మీ ప్రాంతంలో మందు విక్రయాలు పెంచాలంటే ఏం చేయాలి, పోలీసు అధికారికి లెటర్ రాయండి" అంటూ ఇలా పలు ప్రశ్నలు అడగడం విమర్శలకు తావిస్తోంది. 

Tags:    

Similar News