ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

Update: 2019-08-03 06:55 GMT

ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచి కొడుతోంది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షంతో ముంబై అతలాకుతలమవుతోంది. భారీవర్షాల కారణంగా దేశ ఆర్థిక రాజధానిలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శ్యాం తలావ్, హింద్ మట, ఒబేరాయ్ మాల్, సీఎస్టీ రోడ్డు, కుర్లా, మాహిమ్ జంక్షన్, నెహ్రూ నగర్ బ్రిడ్జి, శాంతాక్రజ్, చెంబూర్ లింక్ రోడ్డు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కాగా వాహనాపాల్ఘార్, రాయగడ్, పూణే, కొల్హాపూర్, సతారా జిల్లాల్లో ఆదివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags:    

Similar News