కర్ణాటక : ప్రశాంత్‌ కిశోర్‌తో మాజీ సీఎం కుమారస్వామి భేటీ

Update: 2020-02-26 16:21 GMT
Prashant Kishor And KumaraSwamy File Photo

ప్రశాంత్‌ కిషోర్‌ ఈ పేరు తెలియని వ్యక్తి ఉంటాడేమో కానీ, పేరు తెలియని రాజకీయ నేత ఉండరు. ఎందుకంటే అంతలా ఆయన పెరిపోయింది ఆయన క్రేజ్. దేశ రాజకీయాల్లో ఏ పార్టీనైనా అధికారంలోకి తీసుకురావాలన్న ఈయననే వ్యూహకర్తగా పెట్టుకుంటుంది. ఇటీవలే జేడీయూ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ తరపున వ్యూహకర్తగా పనిచేసి మరోసారి ఆప్ అధికారంలోకి రావడానికి కృషి చేశారు.

ఈ సారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కు డిమాండ్ బాగా పెరిగింది. ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి పనిచేయడానికి పలు పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా.. కర్ణాటక జేడీఎస్‌ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి, కుమారస్వామి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సేవలు ఉపయోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో పనిచేసే ఐప్యాక్ సేవలను వినియోగించుకుంటున్నామని వెల్లడించారు. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌తో కుమారస్వామి భేటీ అయ్యారు. జేడీఎస్‌ భవిష్యత్తు కోసం పలు అంశాన్ని చర్చించారు. మరో సారి భేటీ ఉంటుందని కుమారస్వామి చెప్పారు.

కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(2018) జేడీఎస్ 37 సీట్లను గెలుపొంది కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో కొందరు ఎమ్మెల్యేల రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షలో ప్రభుత్వం నెగ్గలేకపోయింది. బీజేపీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత ఉపఎన్నికల్లో ఆపార్టీ ఘోరంగా దెబ్బతిన్నది.


Tags:    

Similar News