మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు

మహారాష్ట్ర రాజకీయాలు క్షణానికో రకంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు తమ వల్ల కాదంటూ బీజేపీ చేతులెత్తేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

Update: 2019-11-10 15:35 GMT
Uddhav Thackeray

మహారాష్ట్ర రాజకీయాలు క్షణానికో రకంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు తమ వల్ల కాదంటూ బీజేపీ చేతులెత్తేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రంగంలోకి దిగిన ఎన్సీపీ శివసేనకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చినా కొన్ని షరతులు విధించింది. తక్షణం ఎన్డీఏ నుంచి బయటకొచ్చేయాలని, బీజేపీతో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలనీ ఎన్సీపీ షరతు పెట్టింది. మరోవైపు బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ శివసేనే కావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పంపారు. దీనిపై రేపు సాయంత్రంలోగా తన అభిప్రాయం చెప్పాలంటూ సేనకు గడువు విధించారు.

దాంతో ఉద్ధవ్ థాకరే ఇల్లయిన మాతోశ్రీలో పవార్, ఉద్ధవ్ భేటీ అయ్యారు. విడతల వారీ సంప్రదింపులుమరో వైపు ప్రతిపక్షంలోనే కూర్చుంటామని మిత్రపక్షమైన కాంగ్రెస్ తెగేసి చెప్పడంతో ఎన్సీపీ ఎటూ తేల్చుకోలేక పోతోంది. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో సర్కార్ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. బీజేపీకి 105 సీట్లు రాగా శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కు 44, ఇతరులకు 29 స్థానాలు వచ్చాయి. సీఎం పదవిని తమకు ఇవ్వాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాలేదు.

Tags:    

Similar News