పసిడి ధర పరుగులు..

బంగారం ధర రోజురోజుకి పరుగులు పెడుతోంది. బంగారం కొన్కుకోవాలని అనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం ఉన్న ధరలు చూస్తే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయ్. అయితే మొన్నటి వరకు పసిడి ధర తగ్గుతోంది అనే క్రమంలోనే మళ్లీ పెరిగింది.

Update: 2019-08-20 12:03 GMT

బంగారం ధర రోజురోజుకి పరుగులు పెడుతోంది. బంగారం కొన్కుకోవాలని అనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం ఉన్న ధరలు చూస్తే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయ్. అయితే మొన్నటి వరకు పసిడి ధర తగ్గుతోంది అనే క్రమంలోనే మళ్లీ పెరిగింది.. కాగా మళ్లీ పసిడి ధర ఆకాశాన్ని అంటుతోంది. ఇప్పుడు ఏకంగా రూ.40 వేల మార్క్‌కు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే ఏడాదికో.. అటోచ్చే ఏడాదికో కాదు.. ఈ దీపావళికి ఈ స్థాయికి పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

నేడు మార్కెట్లో బంగారం ధర రూ. 200 పెరిగి...38.770 వద్ద కొనసాగుతోంది. ఇక మరోపక్క వెండి ధర చూస్తే రూ. 1.100 తగ్గి రూ. 43, 900లకు చేరింది. నేడు దిల్లీలో 10గ్రాముల బంగారం రూ. 38.770 చేరగా.. గత శనివారం ఇదే బంగారం ధర 10గ్రాములకు రూ. 38.670 ఉంది. నేడు ఆ రికార్డ్‌ను బ్రెక్ చేసింది. ఏది ఏమైనా గానీ పెరిగిన బంగారం ధరలతో సామాన్యుడికి తప్పని తిప్పలు. 

Tags:    

Similar News