దూసుకెళ్లిన పసిడి ధర..ఒక్కరోజే..

Update: 2019-07-05 12:23 GMT

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ ప్రకటన సామాన్య, మధ్య తరగతి వర్గాలను షాక్‌కు గురి చేసింది. బంగారంపై కస్టమ్స్‌ చార్జ్‌లు పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. 10 నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. బంగారంపై కస్టమ్స్ చార్జ్‌ల పెంపుతో పసిడి ధరలు పెరగనున్నాయి.

బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచుతూ కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర అమాంతం పెరిగింది. ఇప్పటికే 34 వేల రూపాయల పైన ఉన్న పుత్తడి ధర శుక్రవారం ఒక్కరోజే 590 రూపాయలు పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 34 వేల 800 వందలకు చేరినట్లు ఆల్‌ ఇండియా సఫారా అసోసియేషన్‌ తెలియచేసింది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. 80 రూపాయలు తగ్గడంతో కేజీ వెండి ధర 38 వేల 500 రూపాయలు ధర పలికింది.

Tags:    

Similar News