కేశాలను దానమిచ్చిన 80 మంది విద్యార్థినులు.. ఎందుకో తెలిస్తే షాక్

భారతీయ మహిళలకు పొడవాటి కురుల అంటే ఎంత ఇష్టపడతారో వేరేగా చెప్పనక్కర్లేదు. ఒత్తయిన జుట్టు కావాలని చాలామందికి అనుకుంటారు.

Update: 2020-03-06 15:07 GMT
Girl students from a college in Coimbatore donated hair to make wigs for cancer patient(Photo: ANI)

భారతీయ మహిళలకు పొడవాటి కురుల అంటే ఎంత ఇష్టపడతారో వేరేగా చెప్పనక్కర్లేదు. ఒత్తయిన జుట్టు కావాలని చాలామందికి అనుకుంటారు. జుట్టు బాగా పెరగడంలేదని కొందరు, జుట్టు రాలకుండా ఉండేందుకు కొందరూ అనేక రెమిడీస్ కూడా వాడుతుంటారు. అమ్మయి కురులు చూడగానే కొండపల్లి బొమ్మకు ప్రాణం పోసినట్లు వుండాలి అంటారు. అయితే కొంత మంది మహిళలు పెద్ద సాహసం చేశారు. వారి దాతృత్వ హృదయాన్ని చాటుకున్నారు. కాన్సర్ కారణంగా జుట్టు కోల్పోయిన వారికి విగ్గు చేయించడం కోసం విద్యార్థినిలు వారి కేశాలను దానంగా ఇచ్చారు.

తమిళనాడులోని కొయంబత్తూర్‌ చెందిన ఓ ప్రైవేటు కాలేజీకి విద్యార్థినుల 80 మంది ఔదార్యం ఇది. అయితే కొందురు వారిని కేశాలనే ఎందుకు దానం చేస్తున్నారు? అని ప్రశ్నించగా.. రోగులకు ఇచ్చేందుకు తమ వద్ద డబ్బు లేదని విద్యార్థినిలుచెప్పారు. కాన్సర్‌ వ్యాధి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం తమ కురులను దానంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. డబ్బులు ఇచ్చేంత ఆర్థిక స్థోమత తమకు లేదని, కాన్సర్ రోగులకు జట్టు లేకపోవడాన్ని గమనించామని, అందుకే తమ కేశాలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అని వినోదిని అనే విద్యార్థిని వెల్లడించింది.

''నాకు వచ్చిన ఆలోచనను నా మిత్రులతో పంచుకున్నాను. మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు తమ జట్టు దానం ఇవ్వాలని 80 మంది పేరును నమోదు చేసుకున్నారు. దానం ఇచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. దాదాపు 200 మంది తమ కేశాలను దానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వినోదిని తెలిపింది.


Tags:    

Similar News