కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ ఒక్కటే: నిజామాబాద్‌లో వెంకయ్యనాయుడు
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఏక్తా ర్యాలీ కార్యక్రమం పాల్గొ్న్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వల్లభాయ్ పటేల్ మార్గంలో మోడీ పయనిస్తున్నారు స్వార్థం కోసం భారత్‌పై కొందరు విమర్శలు చేస్తున్నారు
కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ ఒక్కటే: నిజామాబాద్‌లో వెంకయ్యనాయుడు
సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గంలో ప్రధాని మోడీ పయనిస్తున్నారన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్‌లో నిర్వహించిన ఏక్తా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అందరం ఐక్యంగా ఉండటమే సర్ధార్‌కు నిజమైన నివాళి అని అన్నారు.కొందరు స్వార్థం కోసం భారత ఆర్థిక వ్యవస్థ బాగోలేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ ఒక్కటేనన్న భావనతో ఉండాలని ఆయన ప్రస్తావించారు.