ఫేస్ బుక్ ఫ్రెండ్‌షిప్ పేరుతో కుచ్చుటోపీ

Update: 2019-11-20 12:22 GMT

ఎంఎంటీసీలో పని చేసి రిటైర్ అయి విశాఖలో నివాసముంటున్నాడు సోయమిర్ కుమార్ దాస్‌. ఈయనకి నైజీరియా గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి ఓ మహిళ పేరుతో ఫేస్ బుక్‌ ఫ్రెండ్‌షిప్ చేశాడు. ఈ ఫ్రెండ్‌షిప్‌లో మహిళ నుంచి రోజు ఫోన్లు వచ్చేవి. ఎలక్ట్రానిక్‌ గూడ్స్, క్లోత్స్‌, 25వేల పౌండ్ల నగదు పంపుతున్నట్టు వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. ఇదిలా ఉంటే మరో మహిళ కస్టమ్స్ ఆఫీసర్‌నంటూ కుమార్‌ దాస్‌కు కాల్‌ చేసింది. భారీ నగదు, గిఫ్ట్‌ప్యాక్స్‌ వచ్చినందుకు చార్జ్‌ చెల్లించాలని నమ్మించింది. దీంతో సదరు మహిళ అకౌంట్‌లో 34 లక్షల 19వేల 450 రూపాయలు డిపాజిట్‌ చేశాడు కుమార్‌ దాస్‌.

తర్వాత మోసపోయినట్లు గ్రహించి విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు ను ఆశ్రయించాడు కుమార్ దాస్. దర్యాప్తు కోసం ఢిల్లీ వెళ్లిన విశాఖ పోలీసులు హర్యానా కి చెందిన కిషన్ లాల్ తో సహా ఇద్దరు నైజీరియా దేశస్థులను అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, 95 సిమ్ కార్డ్స్, అయిదు ఏటీఎం కార్డ్స్, 7 మొబైల్ స్ , గఫువు ముగిసిన రెండు పాస్ పోర్ట్స్ స్వాధీనం చేసుకున్నారు.



Tags:    

Similar News