Sharad Yadav: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
Sharad Yadav: వాజ్‌పేయి కేబినెట్లో మంత్రిగా ప్రాతినిధ్యం
Sharad Yadav: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత
Sharad Yadav: కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ ధ్రువీకరించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్ యాదవ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంలో శరద్ యాదవ్ కేంద్ర మంత్రిగా పలు శాఖల్లో పనిచేశారు. 2003లో జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడయ్యారు. శరద్ యాదవ్ ఏడుసార్లు లోక్ సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. శరద్ యాదవ్ మృతిపట్ల పలువురు సంతాపం ప్రకటించారు.