మాజీ ప్రధాని దేవెగౌడకు గాయాలు..

Update: 2019-02-02 14:20 GMT

మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవెగౌడకు గాయాలు అయ్యాయి.. బాత్ రూంలో జారిపడ్డారు. దీంతో ఆయన కుడికాలికి గాయాలయ్యాయి. పద్మనాభ నగర్ లోని తన నివాసంలోని శనివారం ఉదయం బాత్ రూంలోకి వెళ్లిన సమయంలో దేవెగౌడ ప్రమాదవశాత్తూ జారిపడినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. కుడి మోకాలుకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. దేవెగౌడ కాలి గాయానికి సంబంధించి ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు వైద్యులు. కాలికి గాయం కావడంతో దేవెగౌడ అతికష్టంమీద నడుస్తున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న దేవెగౌడ కుమారుడు డాక్టర్ రమేష్ వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

Similar News