కేంద్ర మాజీ సీఈసీ టీఎన్ శేషన్ కన్నుమూత

కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంస్కర్తగా సుప్రసిద్ధులైన టీఎన్ శేషన్ (87) గుండెపోటుతో నిన్న రాత్రి చెన్నైలో మరణించారు.

Update: 2019-11-11 05:08 GMT
కేంద్ర మాజీ సీఈసీ టీఎన్ శేషన్

కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంస్కర్తగా సుప్రసిద్ధులైన టీఎన్ శేషన్ (87) గుండెపోటుతో మరణించారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన భాధపడుతూ నవంబర్ 10న రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు. శేషన్ పూర్తి పేరు తిరునళ్లై నారాయణ అయ్యర్ శేషన్. ఈయన 1932 సంవత్సరంలో కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించారు. అదే గ్రామంలో ఆయన తన పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. తన గ్రాడ్యుయేషన్ ను

మద్రాస్ క్రిస్టియన్ కాళాశాలలో పూర్తి చేసుకున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులను పూర్తి చేసుకున్నారు. చదువులను పూర్తి చేసుకున్న ఆయన 1955లో తమిళనాడు కేడర్‌కు చెందిన బ్యాచ్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా విధులను నిర్వహించారు. 1989వ సంవత్సరంలో ఆయన కేంద్ర కేబినెట్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఆయన నియమితులయ్యారు.

1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు ఆయన పదవిలో కొనసాగారు. తాను ఎన్నికల కమిషన్ గా విధులు నిర్వహించిన కాలంలో ఎన్నికల ప్రక్రియలో అనేక కీలక సంస్కరణలను తీసుకొచ్చారు. ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఆయన అమలు చేశారు. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకునేవారు. శేషన్ ఆయన పదవీ కాలంలో ఉన్నప్పుడు అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1996లో ఆయణని రామన్ మెగసెసే అవార్డుతో సత్కరించింది.



Tags:    

Similar News