ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Update: 2020-01-06 11:03 GMT

ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 22తో అసెంబ్లీకి గడువు ముగియనుండగా జనవరి 14న ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించింది. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించి, అదే నెల 11న ఫలితాలను వెల్లడించనున్నారు.

ఇందుకు జనవరి 14న నోటిఫికేషన్ వెల్లడించనున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. అదే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. నామినేషన్ల దాఖలుకు జనవరి 21 చివరి తేదీ కాగా, జనవరి 23న పరిశీలన ఉంటుందన్నారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువును జనవరి 24గా ప్రకటించారు.


Tags:    

Similar News