ముష్కరులకు అండనిచ్చేందుకు కొన్ని దేశాలు ముందున్నాయి

ముష్కరులకు అండనిచ్చేందుకు కొన్ని దేశాలు ముందున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అన్నారు. పాకిస్థాన్ ముఖ్యంగా ఉగ్రవాదులకు అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

Update: 2019-10-14 08:26 GMT

ముష్కరులకు అండనిచ్చేందుకు కొన్ని దేశాలు ముందున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అన్నారు. పాకిస్థాన్ ముఖ్యంగా ఉగ్రవాదులకు అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్ఐఏ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం అనేది కొత్త అంశం కాదని, వారిపై మూలాలపై దెబ్బకొట్టగలిగితే దాన్ని జయించినట్టే అని ఆయన అన్నారు.

పాకిస్థాన్ అండ లేకపోతే ఉగ్రవాదం ఎప్పుడో అంతమైపోయేదన్నారు. పాకిస్తాన్ వారికి ఆర్గిక సాయం చేస్తుందని ఆయన విమర్శించారు. ముష్కరమూకలపై పోరాటం ఒక్కటే సరిపోదని వారికి అండగా నిలిచి ఆర్దిక వనరులు సమకూరకుండా అడ్డుకోవాలని పేర్కొన్నారు. ఉగ్రవాదులను దెబ్బకొట్టాలంటే ముందు దాని సిద్దాంతాలను రూపుమాపాలని అజిత్ డోబాల్ అన్నారు 

Tags:    

Similar News