దుమారం లేపిన ఢిల్లీ ప్రకటన.. సిక్కిం ప్రత్యేక దేశం అంటూ..

ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఓ ప్రకటన పెద్ద దుమారం లేపింది. ఇటీవల సివిల్ డిఫెన్స్ కార్పొరేషన్ లో వాలంటీర్లుగా చేరాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

Update: 2020-05-24 11:59 GMT

ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఓ ప్రకటన పెద్ద దుమారం లేపింది. ఇటీవల సివిల్ డిఫెన్స్ కార్పొరేషన్ లో వాలంటీర్లుగా చేరాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.. అయితే ఆ ప్రకటనలో భాగంగా భూటాన్, నేపాల్ దేశాల సరసన సిక్కిం రాష్ట్రాన్ని కూడా చేర్చింది. దీనితో ఇది పెద్ద చర్చకే దారి తీసింది. దీనితో ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.

అంతేకాకుండా సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను కూడా రాసింది. ఇది ఘోర తప్పిందమని, తక్షణమే దానిని ఉససంహరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌సీ గుప్తా ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి తమాంగ్ సైతం దీనిపైన స్పందిస్తూ.. సిక్కిం రాష్ట్రంలోని ప్రజలు తాము భారతదేశ పౌరులమని చాలా గర్వంగా చెప్పుకుంటారని, తక్షణమే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు..

ఇక దీనిపైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత్‌లో సిక్కిం రాష్ట్రం అంతర్భాగమని, ఇలాంటి విషయాలలో తప్పులను సహించబోమని స్పష్టం చేశారు. ఉద్యోగ నియమాకాల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరిస్తామని కేజ్రీవాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక అటు ఉద్యోగ నోటిఫికేషన్‌‌లో జరిగిన తప్పిదానికి కారణమైన సీనియర్ అధికారిపై కేజ్రీవాల్ ప్రభుత్వం సస్పెషన్ వేటు వేసింది. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అటు దేశంలో 22 వ రాష్ట్రంగా 1975 మే 16న సిక్కిం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. 




 


Tags:    

Similar News