Delhi Election Results 2020 : ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

Update: 2020-02-11 02:15 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మరి కొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎగ్జిట్ ఫలితాలన్నీ ఆప్‌కు జై కొట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మొత్తం 21 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 10 నుంచి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 672 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు జరిగింది. హస్తినలో మరోసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే వెల్లడించాయి. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈ సారి ఖాతా తెరవడం అనుమానమేనని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.

టైమ్స్‌నౌ- ఆప్‌ 51, బీజేపీ 18, కాంగ్రెస్ 1, ఇతరులు 0

రిపబ్లిక్‌ టీవీ- ఆప్‌ 48-61, బీజేపీ 9-21, కాంగ్రెస్‌ 0-1, ఇతరులు 0

ఎన్డీటీవీ- ఆప్ 49, బీజేపీ 20, కాంగ్రెస్‌ 01, ఇతరులు 0

ఇండియా టుడే- ఆప్‌ 44, బీజేపీ 26, కాంగ్రెస్‌ 0, ఇతరులు 0

Tags:    

Similar News