ఢిల్లీ సీఎం మేనిఫెస్టో.. అన్ని ఉచితం

Update: 2020-01-19 12:38 GMT
Kejriwal File Photo

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇప్పటికే మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన సీఎం విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ఉచిత కరెట్ , ఈ మేనిఫెస్టోలో పలు కీలక అంశాలు పొందుపరిచారు. ప్రజాకర్షణ పథకాలతో కూడిన మేనిఫెస్టోను కేజ్రీవాల్‌ విడుదల చేశారు 24 గంటలు త్రాగునీరు, ప్రతి చిన్నారికీ ఉచిత విద్య, వైద్య, ఆరోగ్యంలో కీలక సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు. మరోసారి ఆప్‌కు అధికారం అప్పగిస్తే హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 8న పోలింగ్‌ జరగనుంది.

మరో వైపు ఇటీవలే ఆమ్‌ ఆద్మీ పార్టీకి నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు ఎమ్మెల్యే ఆదర్శ్‌ శాస్త్రి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై సంచలన వ్యా‌ఖ్యలు చేశారు. ద్వారక్‌ నియోజకవర్గ టికెట్‌ను తిరిగి తనకు దక్కలేదని, టికెట్ కావాలంటే రూ.10 నుంచి15 కోట్లు డబ్బు ఇవ్వాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారని ఆరోపించారు.

కాగా.. శనివారం కాంగ్రెస్ లో చేరిన ఆయన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యేలను కలిసేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సమయం ఇవ్వడం లేదని విమర్శించారు. టికెట్ కేటాయింపు విషయంలో కేజ్రీవాల్ మాట మార్చారన్నారు. అసెంబ్లీ టికెట్ కేటాయింపులు వ్యాపారంగా మార్చారని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అభిప్రాయం చెప్పమని కేజ్రీవాల్‌ను కోరగా ఆయన మౌనంగా ఉన్నారని ఆదర్శ్ శాస్త్రి అన్నారు.

కేజ్రీవాల్‌ డబ్బు అడగడంపై తాను షాక్‌కు గురయ్యానని డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తనకు టికెట్ దక్కలేదని వాపోయారు. ద్వారక్‌ నియోజకవర్గం టికెట్ వినయ్‌ మిశ్రాకు కేటాయించారని చెప్పారు. ఢిల్లీ రాజకీయాల్లో ఆదర్శ్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఆదర్స్ శాస్తి చేసిన వ్యాఖ్యలను ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ఆదర్స్ అసత్యాలు మాట్లాడుతున్నారని తెలిపారు. టికెట్ ఇవ్వనందుకే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.  

Tags:    

Similar News