ప్లాస్మా థెర‌పీతో మెరుగైన ఫ‌లితాలు : సీఎం కేజ్రీవాల్

Update: 2020-04-24 11:51 GMT
Arvind Kejriwal (File Photo)

క‌రోనా వైర‌స్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా రోగులకు అందిస్తున్న ప్లాస్మా చికిత్స సానుకూల ఫలితాలనిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రిలో నలుగురు రోగులపై ప్రయోగాలు నిర్వహించామన్నారు. వీరిలో ఇద్దరు కోలుకొని డిశ్చార్జి కావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ప్రస్తుతానికి ఈ ట్రయల్స్‌ విషయంలో మంచి ఫలితాలే వస్తున్నాయని అన్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో వీటిని మరింతగా పెంచుతామన్నారు. అందువల్ల కరోనాతో పోరాడి కోలుకున్నవారు తమ ప్లాస్మాను దానం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కోలుకున్న పేషెంట్ల నుంచి తీసుకున్న ప్లాస్మాతో.. కోవిడ్‌19 వ్యాధిగ్ర‌స్తుల‌కు చికిత్స అందివ్వ‌డ‌మే ప్లాస్మా థెర‌పీ.

Tags:    

Similar News