ఢిల్లీ బీజేపీ మేనిఫెస్టోలో వరాలు

Update: 2020-01-31 15:56 GMT

ఢిల్లీలో ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ కొత్త పథకాలను తమ మేనిఫెస్టో ద్వారా ప్రకటించింది. ఢిల్లీ వాసులకు రెండు రూపాయలకే కిలో గోధుమ పిండి అందిస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో వెల్లడించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అమ్మాయిలు కాలేజీకి వెళ్లినట్టయితే వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లోని అమ్మాయిల పెళ్లికి రూ. 51 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఢిల్లీలో అమ్మాయి పుట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంక్ ఖాతా తెరుస్తుందని... ఆ అమ్మాయికి 21 ఏళ్లు రాగానే అకౌంట్‌లో రూ. 2 లక్షలు వేస్తామని పేర్కొంది. ఆయుష్మాన్ యోజనను ఢిల్లీలో అమలు చేస్తామని వివరించింది. ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం మరింత శ్రద్ధ పెడతామని ప్రకటించింది.

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చింది. వ్యాపారులకు ఇబ్బందిగా మారిన సీలింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని... అద్దె ఇంట్లో ఉంటున్న వారికి చేయూత అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఢిల్లీలో కొత్త కాలేజీ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపింది.  

Tags:    

Similar News