Delhi Assembly Election : అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్‌

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Update: 2020-01-14 15:48 GMT
Kejriwal File Photo

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల వాతావరణం నెలకొనడంతో అధికారం కైవసం చేసుకునేందుకు బీజేసీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నారు. అధికారపార్టీ ఆమ్ ఆద్మీకూడా మరో సారి ఫిఠం కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ప్రచారం ముందున్నారు సీఎం కేజ్రీవాల్ . మంగళవారం నామినేషన్లు ప్రారంభం కావడంతో..తొలి రోజే అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సారి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 15మందికి నిరాశ ఎదురైంది. 46 స్థాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో పట్పర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పోటీ చేయనున్నారు. కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి పోటీ చేయనున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి 8 మందికి మహిళలకు అవకాశం కల్పించింది. వచ్చే నెల(ఫిబ్రవరి ) 8న ఎన్నికలు జరగనున్నాయి. తుది ఫలితాతు ఫిబ్రవరి 11న వెలువడతాయి. దేశ రాజధానిలో ఢిల్లీలో ఎన్నికలు కావడంతో బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా రావడంతో ఈ సారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ యోచింస్తుంది. కాగా.. కాంగ్రెస్ కంచుకోట ఢిల్లీలో ఎన్నికల్లో మళ్లి గెలవాలని ఆ పార్టీ దక్కించుకోనుంది. ఈ ఎన్నికల్లో 1.46 కోట్ల మంది అభ్యర్థలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఆప్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఇదే.  

 

Tags:    

Similar News