గ్యాస్ సిలెండర్ పేలి 11 మంది మృతి.. 15 మందికి గాయాలు

గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో 11మంది దుర్మాణం చేందారు. మరో 15మందికి గాయాలైయ్యాయి. ఈ ఘటన మొహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి వలీద్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2019-10-14 05:05 GMT

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మౌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో 11మంది దుర్మాణం చేందారు. మరో 15మందికి గాయాలైయ్యాయి. ఈ ఘటన మొహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి వలీద్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. సుమారు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్ఠలానికి చేరుకున్నారు.

ఓ ఇంట్లో భారీ శబ్ధం వినిపించడంతో ఆ వీధిలోని వారతంగా ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అంధించారు. రెస్కూ టీం కూడా అక్కడకు చేరుకుంది. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కూలిపోయింది. శిథిలాలా కింద కొందరూ చిక్కుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను ఆరా తీశారు. సహాయకచర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ప్రగాఢ సంతాపం తెలిపారు.

Tags:    

Similar News