Delhi Liqour Scam: మాగుంట రాఘవరెడ్డి రిమాండ్‌ను పొడిగించిన కోర్టు
Delhi Liqour Scam: కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని అందుకే మాగుంట..
Delhi Liqour Scam: మాగుంట రాఘవరెడ్డి రిమాండ్‌ను పొడిగించిన కోర్టు
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఉన్న మాగుంట రాఘవ జ్యుడిషియల్ రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మార్చి 28 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ..స్పెషల్ కోర్టు తీర్పును వెలువరించింది. లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని..అందుకే రాఘవరెడ్డి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. మాగుంట రాఘవరెడ్డి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. ఫిబ్రవరి 10న మాగుంట రాఘవ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.