దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలకు రేపు ఓట్ల లెక్కింపు ..

Update: 2019-10-23 14:58 GMT

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 53 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనున్నది. ఇందుకు కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగినట్లుగా తేలిపోయింది.

మహారాష్ర్టంలో రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ, శివసేనతో కలిసి బరిలోకి దిగింది. పూర్వ వైభవంకోసం కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు పోటీ చేశాయి. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 స్థానాలతో పాటు ఉత్తరప్రదేశ్‌ లో 11, గుజరాత్-6, బీహార్-5, కేరళ-5, అసోం-4, పంజాబ్-4 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడు, రాజస్తాన్, హిమాచల్‌లో రెండేసి స్థానాలకు పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలోని సతారా,మధ్యప్రదేశ్‌లోని సమస్తీపుర్ లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి.

ఇక తెలంగాణలోని హూజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొన్నది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయి. కారుకు 50శాతానికి పైగా ఓట్లు.. కాంగ్రెస్ పార్టీకి 40శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించాయి. 

Tags:    

Similar News