NTR University Exam Schedule: పరిక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ..

NTR University Exam Schedule: కరోనా నేపధ్యంలో వాయిదా పడ్డ ఎంబీబీఎస్, బీడీఎస్ చివరి ఏడాది పరిక్షల షెడ్యూల్ ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది.

Update: 2020-08-19 04:23 GMT

NTR University Exam Schedule: కరోనా నేపధ్యంలో వాయిదా పడ్డ ఎంబీబీఎస్, బీడీఎస్ చివరి ఏడాది పరిక్షల షెడ్యూల్ ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. సెప్టెంబర్ 14నుంచి 30 వరకు బీడీఎస్ ఆఖరి సంవత్సరం, సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరిక్షలు నిర్వహిస్తామని తెలిపింది. అటు బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 06 వరకు పర్క్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 9,652 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 56,090 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,652 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 9,211 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరు జిల్లా 14, ప్రకాశం జిల్లా 11, గుంటూరు జిల్లా 09, అనంతపురం జిల్లా 09, కర్నూలు జిల్లా 09, నెల్లూరు జిల్లా 07, పశ్చిమ గోదావరి జిల్లా 06, శ్రీకాకుళం జిల్లా 05, విశాఖపట్నం జిల్లా 05, విజయనగరం జిల్లా 05, తూర్పు గోదావరి జిల్లా 04, కృష్ణ జిల్లా 03, కడప జిల్లాలో 01 కరోనా బారిన పడి మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 3,06,261. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,820. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,18,311 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 85,130 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 56,090 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 29.05లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. 

Tags:    

Similar News