Breaking: ఆర్‌బీఐ కీలక ప్రకటన..వచ్చే 3 నెలలు ఈఎంఐలు కట్టకపోయినా పర్వాలేదు

Update: 2020-03-27 05:19 GMT

కరోనాతో కంగారుపడుతున్న సామాన్యూలకు ఆర్‌బీఐ శుభవార్త అందించింది. ఈఎంఐలపై 3 నెలల మారటోరియం విధించింది. అన్ని రకాల రుణాలపై మూడు నెలలపాటు ఈఎంఐలు కట్టకుండా వెసులుబాటు కల్పించింది. మార్చి ఒకటి నుంచి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్ బీఐ తెలిపింది.

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆర్ బీ ఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెపోరేటు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. అలాగే రివర్స్‌ రెపోరేటును 90 పాయింట్లకు కుదించింది. దీంతో ప్రస్తుతం రెపోరేటు 4.4 శాతం, రివర్స్‌ రెపోరేటు 4 శాతం వద్దకు చేరుకుంది. ప్రస్తుత పరిస్థితులను ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తెలిపారు. ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు అసవరైన చర్యలు తీసుకుంటామన్నారు.

మార్చి 24-26 మధ్య జరిగిన సమావేశాల్లో తాజా పరిస్థితులను పూర్తిగా సమీక్షించి ఈ నిర్ణయాలు తీసుకున్నామని శక్తికాంతదాస్‌ తెలిపారు. వైరస్‌ వ్యాప్తి, దాని తీవ్రత ఎంత కాలం కొనసాగనుందన్న అంశాలపైనే భవిష్యత్తు వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ అంచనాలు ఉంటాయన్నారు.

Tags:    

Similar News