Corona Effect: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా వైరస్... ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ మహమ్మారి వలన చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు.

Update: 2020-03-22 11:12 GMT
Mamata Banerjee (file Photo)

కరోనా వైరస్... ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ మహమ్మారి వలన చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు.. దాదాపు 180 దేశాలకి పైగా వ్యాపించిన ఈ వైరస్ వలన 13 వేల మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది.. చైనాలో మొదలైనప్పటికీ ఈ కేసుల సంఖ్య ఇటలీలో క్రమక్రమంగా పెరుగుతోంది. ఇక భారత్లో 300 కేసులు నమోదయ్యాయి. ఇక మరణించిన వారి సంఖ్య నేటితో అరుకు చేరుకుంది.

తాజాగా ముంబైకి చెందిన 63 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. మహారాష్ట్రలోనే ఇది రెండో కరోనా మరణం కావడం విశేషం. దీనితో మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 74కు చేరింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం సరిహద్దుల్ని సీల్ చేసింది. ఇక మహారాష్ట్రతో పాటు. బీహార్, పశ్చిమబెంగాల్, గోవా కూడా తమ సరిహద్దుల్ని మూసివేశాయి.

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 7.85కోట్ల మందికి రేషన్ ఉచితంగా ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ అధికార ప్రకటన వెలువరించింది. ప్రభుత్వ సబ్సిడీ కింద ప్రజలకు రెండు కిలోల బియ్యం, మూడు కిలోల గోధుమ పిండీ అందిస్తున్నట్లు తెలిపింది. పేదలకు సెప్టెంబర్ నెలవరకు ఉచితంగా రేషన్ అందిస్తామని హామీ ఇచ్చింది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లాగే యూపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఒక నెల ఉచిత రేషన్ సరుకులను అందిస్తామని యోగి సర్కార్ వెల్లడించింది. అంతేకాకుండా ఉపాధి కోల్పోయే రోజువారీ శ్రామికులకు రూ.1000 చొప్పున ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయం వల్ల దాదాపు 35 లక్షల మంది రోజువారి కార్మికులు మరియు 20.37 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు.


Tags:    

Similar News