పోలీసు సిబ్బందికి కరోనా.. తమిళనాడులో మూడు రోజులు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

Update: 2020-04-24 10:32 GMT
Representational Image

కరోనా వైరస్‌ ఎవర్నీ వదలడం లేదు. అందరిని వెంటాడుతూ చంపేస్తుంది. భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఈ కేసుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా తమిళనాడులో పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. కోయంబత్తూర్‌లో ఏడుగురు పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. ముగ్గురు మహిళా సిబ్బందితో పాటు మొత్తం ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు పోలీసు శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 

మూడు రోజులపాటు తమిళనాడులోని ఐదు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న చెన్నై, మధురై, కోయంబత్తూర్‌, తిరుపూర్‌, సేలమ్‌లలో ఏప్రిల్‌ 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News