Congress: లోక్‌సభ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
Congress: 46 మంది అభ్యర్థులతో ఫోర్త్ లిస్ట్
Congress: లోక్‌సభ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
Congress: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల నాలుగో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. మరో 46 మంది అభ్యర్థులతో ఫోర్త్ లిస్ట్ విడుదల చేసింది ఏఐసీసీ. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి కేటాయింపులు లేవు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి, వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, సహారన్‌పుర్ నుంచి ఇమ్రాన్ మసూద్, కార్తీ చిదంబరం- శివగంగ, మాణికం ఠాగూర్ - విరుదునగర్, హరిద్వార్ నుంచి వీరేందర్ రావత్ పోటీ చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటివరకు మొత్తం 184 స్థానాలకు అభ్యర్థుల ఖరారు పూర్తైంది.