Congress: నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

Congress: సాయంత్రం 4 గంటలకు భేటీకానున్న సీఈసీ

Update: 2024-03-27 04:00 GMT

Congress: నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

Congress: నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఆ పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఫైనల్ చేసే దిశగా ఈ మీటింగ్ కొనసాగనుంది. సీఈసీ మీటింగ్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి హాజరుకానున్నారు. ఇక తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నేతలు, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించింది ‎ఏఐసీసీ. ప్రజల్లో బలం, కుల సమీకరణాలు, పార్టీకి చేసిన సేవ ఆధారంగా అభ్యర్థుల పేర్లను ఆయా నియోజకవర్గాల్లోని నేతలు సిఫారసు చేశారు.

అటు వివిధ సర్వేల రిపోర్టులు, పార్టీ విధేయంగా ఆధారంగా అభ్యర్థులపై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చింది ఆ పార్టీ అధిష్టానం. మరో వైపు ఢిల్లీలో కాంగ్రెస్ మీటింగ్‌తో తెలంగాణలోని ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. హాట్‌సీట్లుగా మారిన కొన్ని స్థానాలపై నేతల మధ్య పోటీ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు భువనగిరి పార్లమెంట్ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ఇటు హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ స్థానాల్లో ఒకరిద్దరి పేర్లను పరిగణనలోకి తీసుకుని గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఫైనల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి.

Tags:    

Similar News