కాపీ కొట్టకుండా అట్టపెట్టెలు

విద్యార్ధలపై ఓ యూనివర్సిటీ సిబ్బంది అతిగా ప్రవర్తించారు. విద్యార్ధులకు పరీక్ష హాలులో తల పక్కకు తిప్పకుండా, చూసి రాతలకు పాల్పడకుండా ఉండలని ఓ వినూత్న ఆలోచన చేసింది. విద్యార్థులందరి తలలకు అట్టపెట్టెలు పెట్టించింది.

Update: 2019-10-19 12:55 GMT

విద్యార్ధలపై పట్ల ఓ యూనివర్సిటీ సిబ్బంది అతిగా ప్రవర్తించారు. విద్యార్ధులకు పరీక్ష హాలులో తల పక్కకు తిప్పకుండా, చూసి రాతలకు పాల్పడకుండా ఉండలని ఓ వినూత్న ఆలోచన చేసింది. విద్యార్థులందరి తలలకు అట్టపెట్టెలు పెట్టించింది. కర్ణాటకలోని హావేరిలో భగత్ ఫ్రీ యూనివర్సిటీ విద్యార్థులకు ఈ విధంగా నరకం చూపించారు. కళ్ళ భాగం కనిపించేలా రంధ్రాలు పెట్టిన అట్టపెట్టెలతో విద్యార్థులకు పరీక్షలు రాయించడంతో కొంతమంది ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు.

అయితే విద్యార్థుల ముఖాలకు అట్టపెట్టలు పెట్టించి పరీక్షలు రాయించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ల సమక్షంలో ఇలా జరగడంపై విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. పరీక్షల్లో కాపీలు కొట్టకుండా అట్టపెట్టెలు ముఖాలకు పెట్టి రాయిస్తే ఇన్విజిలేటర్లు ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక విద్యాశాఖ దృష్టికి చేరింది. ఈ ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాలని తాఖీదులు జారీ చేసింది. 

Tags:    

Similar News