పౌరసత్వ చట్టంపై దాఖలైన పిటీషన్ల విచారణపై భారత ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

పౌరసత్వ చట్టంపై దాఖలైన పిటీషన్ల విచారణపై భారత ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2020-01-09 16:52 GMT

పౌరసత్వ చట్టంపై దాఖలైన పిటీషన్ల విచారణపై భారత ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న హింసాత్మక ఘటనలు ఆగినప్పుడే విచారణ చేపడతామని స్పష్టం చేశారు. సీఏఏపై తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతోందని వేసిన పిటిషన్‌‌ గురించి.. అడ్వకేట్ వినీత్ దందా ప్రస్తావించిన సందర్భంలో సీజేఐ బొబ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. హింస కారణంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. శాంతియుత వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. పిటిషన్లను విచారించేందుకు అంగీకరించిన ధర్మాసనం.. హింసాత్మక ఘటనలు ఆగాక విచారించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. సీఏఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దేశంలోని పలు కోర్టుల్లో మొత్తం 60 పిటిషన్లు దాఖలయ్యాయి.  


Full View


Tags:    

Similar News