తెలుగు రాష్ట్రాలల్లో మళ్లీ మోగిన ఎన్నికల నగారా

తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగారా మోగింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

Update: 2020-02-25 05:26 GMT

తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల నగారా మోగింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 26న దేశవ్యాప్తంగా 55 రాజ్యసభస్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 17 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మార్చి 26న ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక అదే రోజు కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

మార్చి 6న దీనికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుంది. నామినేషన్‌ దాఖలుకు మార్చి 13వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 16న నామినేషన్ల పరిశీలనా, మార్చి 18 నామినేషన్ల ఉపసంహరణ తేదీలను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఏపీలో కె.కేశవరావు, ఎంఏ ఖాన్‌, టి.సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మీ, పదవీ కాలం ముగియనుంది. తెలంగాణలో కేవీపీ, గరికపాటి రాంమోహన్‌రావు పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కేశవరావు ఆంధ్రాకు , గరికపాటి రామ్ మోహన్ రావు తెలంగాణకు చెందిన ఎంపీలు అప్పట్లో ప్రకటించింది.

 

Full View


Tags:    

Similar News