చిదంబరం అరెస్ట్

Update: 2019-08-21 16:23 GMT

కేంద్ర మాజీ ఆర్ధిక శాఖా మంత్రి పి. చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు . ఐఎన్ఎక్స్ మీడియాలో ఆరోపణలు ఎదురుకుంటున్న అయనని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు . అయితే దీనికి ముందు అయన అజ్ఞాతాన్ని వీడి కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఐఎన్ఎక్స్ మీడియాకి తనకి ఎలాంటి సంబంధం లేదని అయన చెప్పుకొచ్చారు . అయితే సీబీఐ అధికారులు అక్కడికి చేరుకునే లోపే చిదంబరం తన ఇంటికి చేరుకున్నారు . దీనితో సీబీఐ అధికారులు అయన ఇంటికి వెళ్లారు . అక్కడ సిబ్బంది సీబీఐ అధికారులకి అనుమతి ఇవ్వకపోవడంతో అధికారులు గేట్లు దూకి లోపలికి వెళ్ళడంతో చిదంబరం ఇంటిముందు హైడ్రామా నెలకొంది .. చిదంబరం అరెస్ట్ తో పార్టీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ..

Tags:    

Similar News