మహిళా స్వీపర్‌ను జుట్టుపట్టుకొని ఈడ్చేసిన స్కూల్ సూపరెండెంట్ భర్త

Update: 2019-08-19 11:38 GMT

మానవత్వం సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది. మహిళ అని కూడా చూడకుండా రెచ్చిపోయాడో రాక్షసుడు. జుట్టుపట్టుకొని బయటకు ఈడ్చేసాడు. నెలల పసికందు అనికూడా చూడకుండా చిన్నారిని కూడా బయటపడేశాడు. ఆపై ఇంట్లో సామన్లు కూడా బయట పడేసి గదికి తాళం వేశారు. ఇంట్లో నుంచి నడి రోడ్డుపైకి చేయిపట్టుకుని ఈడ్చుకొచ్చిన సీన్‌ వైరల్‌గా మారింది.

కొరియా జిల్లా జాన​క్‌పూర్‌లోని ఓ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తుంది ఓ మహిళ. దీంతో స్కూల్‌లోనే ఓ గదిలో మూడునెలల చిన్నారితో కలిసి ఉంటుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ స్కూల్ సూపరెండెంట్.. ఆ మహిళ ఉంటున్న గదిని ఖాళీ చేయాలని తెగ ట్రై చేసింది. అందుకు సదరు మహిళ ససేమిరా అనడంతో చేసేది లేక తాను ఓ మహిళ అన్న సంగతి మరిచిపోయి భర్తతో కలిసి మహిళను దారుణంగా బయటకు ఈడ్చేసింది. అంతేకాక నెలలపాపను సైతం ఇద్దరు కలిసి రోడ్డుపై పడేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. సూపరెండెంట్ భర్తపై కేసు నమోదు చేశారు. త్వరలోనే అతడ్ని అరెస్ట్ కూడా చేస్తామని పోలీసులు తెలిపారు. 



Tags:    

Similar News