బస్సుపైన బర్త్ డే పార్టీ.. సడన్ బ్రేక్ వేయడంతో..

Update: 2019-06-18 05:56 GMT

సరదా తప్పు కాదు కానీ అప్రమత్తత అవసరం ఒక్కోసారి సరదా శృతి మించితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చెన్నైలో జరిగిన తాజా ఘటన చూస్తే అర్థమౌతుంది. చెన్నైలో కొందరు పోకిరీలు ఎంజాయ్ మెంట్ గురించి ఆలోచించారు కానీ దానివల్ల తరవాత కలిగే అనర్ధాలు, ఇబ్బందుల గురించి ఆలోచించలేదు. స్నేహితుడి బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా స్టూడెంట్స్ బస్సు ఎక్కి హంగామా చేశారు. యాక్షన్ హీరోల్లా బస్సుపై నిలబడి స్టంట్లు చేద్దాం అనుకున్నారు. కానీ అదికాస్త ఓవరాక్షనై బొక్కబోర్లా పడ్డారు..

బస్సు పైన సుమారు 50మంది ఎక్కి ఈలలు వేస్తు, గోల చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గోలంతా రద్దీగా ఉన్న ప్రధాన రహదారి పైన అందరూ చూస్తుండగానే జరిగింది. అయితే బస్సు ముందు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం వెనక ఏం జరుగుతుందో అని కంగారు పడి బ్రేక్ వేసి వెన్నకి తిరిగి చూశాడు. బస్సు వేగంగా వస్తుండటం ముందున్న బైక్ ఆపేయడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఇక అంతే బస్సు పై ఉన్న విద్యార్థులు పిట్టల్లా కింద పడ్డారు. ముందున్న బండి మీద కొందరు రోడ్డు మీద మరికొందరు పడిపోయారు ఈ తతంగాన్ని కొందరు విడియో తీయగా అదికాస్త వైరల్ అవుతోంది.

విద్యార్థులు అంతా చెన్నై పచ్చయప్పా కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. విద్యార్థులకు పెద్ద గాయాలు ఏమీ తగలక పోయినా పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దీనిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.. అందరూ విద్యార్థులు కావడంతో వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌంన్సలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. వేడుకలు శృతి మించితే ఇలాంటి అనర్ధాలే జరుగుతాయంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

Full View  

Tags:    

Similar News