Chandrayan 3: చంద్రుడికి 70 కి.మీ దూరంలో చంద్రయాన్ 3.. ఫొటోలు షేర్ చేసిన ఇస్రో..
Chandrayan 3: చంద్రుడికి 70 కి.మీ దూరంలో చంద్రయాన్ 3.. ఫొటోలు షేర్ చేసిన ఇస్రో..
Chandrayan 3: చంద్రుడికి 70 కి.మీ దూరంలో చంద్రయాన్ 3.. ఫొటోలు షేర్ చేసిన ఇస్రో..
Moon Latest Pics: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరువైంది. బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. దీని కోసం యావత్ భారతమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషణ కొనసాగిస్తోంది.
కాగా, 70 కిలోమీటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలను ల్యాండర్ తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను ఇస్రో ట్విట్టర్ ఎక్స్ లో పోస్టు చేసింది. విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఈ ఫొటోలను తీసినట్లు తెలిపింది. మిషన్ షెడ్యూల్‌లో ఉందని.. సిస్టమ్‌లు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నట్లు పేర్కొంది. సున్నితమైన సెయిలింగ్ కొనసాగుతోందని తెలిపింది. చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం రేపు సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించింది.