Goa Murder: భర్త మీద కోపంతోనే.. గోవా మర్డర్ కేసులో కీలక విషయాలు

Goa Murder: పోస్టుమార్టంలో ప్రాథమికంగా నిర్ధారించిన వైద్యులు

Update: 2024-01-11 15:15 GMT

Goa Murder: భర్త మీద కోపంతోనే.. గోవా మర్డర్ కేసులో కీలక విషయాలు

Goa Murder: సంచలనం సృష్టించిన గోవా మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు సుచనా సేథ్ తనకు ఉన్న డిప్రెషన్‌తోనే కొడుకును హత్య చేసినట్టు తెలుస్తోంది. 2010లో వెంకటరత్నం, సుచనాసేథ్‌కు వివాహం జరగగా.. ఆగస్టు 2019లో సంతానం కలిగింది. సంతానం అనంతరం 2021లో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో అప్పటినుంచి భర్తతో విడిగా ఉంటోంది సుచనా సేథ్‌. అయితే 2022లో వీరిద్దరి విడాకుల ప్రాసెస్ ప్రారంభం అయింది. ఈ కేసులో కోర్టు ఇటీవల ఓ తీర్పు వెలువరించింది. కొడుకు ఎవరి దగ్గర ఉండాలనే అంశంపై వాదనలు జరగగా.. ప్రతీ ఆదివారం తండ్రి వెంకటరత్నం తన కొడుకుని కలిసే అవకాశం కల్పించింది కోర్టు. అయితే కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై సుచనాసేథ్ అసంతృప్తితో ఉంది. ఇదే విషయం కొడుకు హత్యకు దారి తీసింది.

కోర్టు తీర్పు ప్రకారం తన కొడుకును భర్త కలవడాన్ని జీర్ణించుకోలేకపోయింది సుచనా సేథ్. ఆ కారణంగా హత్యకు ముందు నాలుగు వారాలు తండ్రికి తన కొడుకును దూరంగా ఉంచింది. హత్యకు ముందురోజు భర్తకు మెసేజ్ చేసిన సుచనా.. కొడుకును కలవొచ్చని భర్తకు చెప్పింది. అదేరోజు తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసింది.

జనవరి 6 నుంచి గోవాలో హోటల్‌ బుక్ చేసిన సుచనా సేథ్‌.. ఆరోజు కొడుకుని హత్య చేసింది. హత్య చేసిన హోటల్‌ గదిలో రెండు సిరప్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతదేహానికి పోస్టు మార్టం చేసిన వైద్యులు.. కొడుకుకి సుచనా హెవీ డోస్‌ ఇచ్చినట్టు గుర్తించారు. కొడుకు మత్తులో ఉండగా తలగడతో ఉక్కిరిబిక్కిరి చేసి హత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.

Tags:    

Similar News