నేడు కేంద్రకేబినెట్ భేటీ.. కాశ్మీర్‌కి ప్రత్యేక ప్యాకేజీ?

ఇవాళ కేంద్రకేబినెట్ సమావేశం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన కొనసాగనున్న మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2019-08-28 01:27 GMT

ఇవాళ కేంద్రకేబినెట్ సమావేశం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన కొనసాగనున్న మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీరీ యువతకు ప్రత్యేక ఉద్యోగాలతోపాటు, కశ్మీర్ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులను అందించేందుకు గాను ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

జమ్ము కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని ప్రధాని మోడీ తోపాటు పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రహుం శాఖ సహాయ మంత్రి అమిత్ షాలు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే రెండు కేంద్ర పాలితా ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని హమీ ఇచ్చారు. జమ్ము కశ్మీర్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేసిన కేంద్రం ఇప్పుడు వాటిని అమల్లో పెట్టేందుకు సిద్దమైంది. 

Tags:    

Similar News