పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

Update: 2020-01-25 16:30 GMT

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యున్నత పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలు చేసిన వారికి పద్మపురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాదికి గాను మొత్తం 21 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. పద్మవిభూషన్‌ అవార్డులు ఈసారి ఏడుగురి దక్కాయి. దివంగత లీడర్లు జార్జ్‌ ఫెర్నాండెజ్‌, అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌కు పద్మ విభూషన్‌ లభించింది. పద్మ భూషన్‌ అవార్డులు 16 మందికి దక్కాయి. ఈ 16 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి పీవీ సింధుకు అవార్డు దక్కింది. మహారాష్ట్ర నుంచి ఆనంద్‌ మహేంద్ర పద్మ భూషన్‌ అవార్డు దక్కింది.

ఈ ఏడాది మొత్తం ఐదు తెలుగు పద్మాలు వికసించాయి. క్రీడాల విభాగంలో తెలుగు తేజం పీవీ సింధూను పద్మభూషణ్ వరించింది. తెలంగాణ నుంచి వ్యవసాయం కేటగిరిలో చిన్నతల వెంకట్ రెడ్డికి.. విద్య, సాహిత్యం కేటగిరిలో విజయసార్థి శ్రీభాష్యంకు పద్మశ్రీలు దక్కాయి. ఏపీ నుంచి కళలు కేటగిరిలో యడ్ల గోపాలరావుకి.. దలవాయి చలపతిరావు పద్మశ్రీ లభించాయి. 

Tags:    

Similar News