Jammu Kashmir: ఆర్మీ ట్రక్కులో మంటలు.. నలుగురు సైనికులు సజీవదహనం
Jammu Kashmir: ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
Jammu Kashmir: ఆర్మీ ట్రక్కులో మంటలు.. నలుగురు సైనికులు సజీవదహనం
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోరప్రమాదం జరిగింది. పూంచ్-జమ్మూ హైవేపై వెళ్తున్న ఆర్మీ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు సజీవదహనమయ్యారు. మరికొందరికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సైనికులు.. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో ట్రక్కు పూర్తిగా కాలిబూడిదైంది. మరోవైపు.. ఘటనపై ఆర్మీ అధికారులు విచారణకు ఆదేశించారు.