కర్ణాటక ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు... ఆధిక్యంలో బీజేపీ

Update: 2019-12-09 06:09 GMT
ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల కర్ణాటకలోని మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇదిలా ఉంటే 15 స్ధానాలకు గాను బీజేపీ ఒక స్థానాన్ని గెలుకుంది. ఎల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి 'హెబ్బర్‌ శివరామ్‌ తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. అంతే కాకుండా మరో 11 స్థానాల్లోనూ బీజేపీ ముందంజలో ఉంది. మరో స్థానంలో స్వతంత్ర

అభ్యర్థి ముందంజలో ఉండగా, రెండు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కే.ఆర్‌.పేటలో జేడీఎస్‌, హుస్నూర్, శివాజీనగర్‌‌లో కాంగ్రెస్‌, మహాలక్ష్మీ లేఅవుట్, కాగ్వాడ్, హన్సూర్, ఎల్లాపూర్‌, చిక్‌బళ్లాపూర్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. హోస్‌కోట్‌లో స్వతంత్ర అభ్యర్థి శరత్ బచీచ్ గౌడ్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ మధ్యాహానానికి ముగియనుంది.

ఇకపోతే కర్ణాటకలో మొత్తం 223 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే వాటిలో ప్రస్తుతం భాజపా 105 స్థానాలను గెలుచుకుంది. అంతే కాకుండా వీరికి స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా తోడయింది. ఇక బీజేపీ తిరిగి కర్నాటకలో అధికారాన్ని చేపట్టడానికి అతి చేరువలో ఉంది.


Tags:    

Similar News