పక్షి దెబ్బకు విమానానికి భారీ నష్టం.. ఎంతో తెలుసా ?

ఓ భారీ విమానానికి చిన్న పక్షి దెబ్బకు కోట్లలో నష్టం వాటిల్లింది. ఆ విమానం కూడా అణుదాడులకు ఉపమోగపడే ఓ కీలకమైన విమానం కావడం విశేషం.

Update: 2019-10-19 07:29 GMT

ఓ భారీ విమానానికి చిన్న పక్షి దెబ్బకు కోట్లలో నష్టం వాటిల్లింది. ఆ విమానం కూడా అణుదాడులకు ఉపమోగపడే ఓ కీలకమైన విమానం కావడం విశేషం. మేరీల్యాండ్‌లోని రివల్ నేవల్ ఎయిర్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ రెండున దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా నేతలకు యుద్ధకాలంలో రక్షణ కల్పించడంతోపాటుగా, అణుదాడులు ఉపయోగపడే విమానం పక్షి కారణంగా ప్రమాదం జరిగి 14 కోట్లు నష్టం వాటిల్లింది. e-6b మెర్క్యురీ రకం విమానం రన్‌వే‌పైకి వేళ్తున్న క్రమంలో దానిని ఓపక్షి ఢీకొట్టింది. మిమానాన్ని వెంటనే ల్యాండ్ చేశారు.

అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ పక్షి కారణంగా విమానంలో నాలుగు ఇంజన్లలో ఒకటి పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనను ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏక్లాస్ ప్రమాదంగా తెలిపింది. విమానానికి చెందిన ఇంజన్ దెబ్బతినడంతో దాని ఖరీదు సుమారు రూ.14కోట్లు ఉంటుందని వైమానిక దళం పేర్కొంది.  

Tags:    

Similar News