అయోధ్య కేసులో ముగిసిన వాదనలు

Update: 2019-10-16 10:56 GMT

అయోధ్య కేసుపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది అత్యున్నత న్యాయస్థానం. డెడ్‌లైన్‌కు గంట ముందే వాదనలు ముగిశాయి. 40 రోజుల పాటు అయోధ్య కేసులో వాదనలు జరిగాయి. ఇంతకు మించి మరేవైనా ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై నవంబర్‌ 17 లోపు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

అయోధ్య కేసులో చివరి రోజు వాడివేడిగా వాదనలు జరిగాయి. విచారణలో భాగంగా సీజేఐతో ఇటు హిందూ, అటు ముస్లిం తరుపు న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉంటే రాతపూర్వక మరేవైనా విషయాలుంటే రాతపూర్వకంగా చెప్పవచ్చని, కానీ ఆ అభ్యర్థనలకు కేవలం 3 రోజుల గడువు మాత్రమే విధించారు. ఈ కేసుకు సంబంధించి మరో 30 రోజుల్లో తీర్పు ఇస్తామని సీజేఐ ప్రకటించారు.

Tags:    

Similar News